1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

ఎక్కడ అవకాశం ఇస్తే.. అక్కడ చేస్తా: రీమాసేన్

ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన 'చిత్రం' సినిమా ద్వారా తెలుగు వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైన అందాల  ముద్దుగుమ్మ రీమాసేన్
ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన 'చిత్రం' సినిమా ద్వారా తెలుగు వెండితెరకు హీరోయిన్‌గా పరిచయమైన అందాల ముద్దుగుమ్మ రీమాసేన్. ఆ తర్వాత 'చెలి', 'మనసంతా నువ్వే' వంటి చిత్రాల్లో నటించింది. తాజాగా 'యమగోల మళ్లీ మొదలైంది' అనే చిత్రంలో నటిస్తోంది. అలాగే మరో తమిళ చిత్రంలోను నటిస్తోంది. అయినప్పటికీ ఇటు తెలుగు, తమిళ భాషల్లో సరైన అవకాశాలు లేవు.

ఈ విషయంపై రీమా వద్ద ప్రశ్నించగా తనకు తానుగా సినిమా అవకాశాలను వదులుకోవడం లేదు. తెలుగు కంటే తమిళంలోనే ఎక్కువుగా అవకాశాలు వస్తున్నాయి. అయితే నేను మాత్రం ఎక్కడ అవకాశాలు వస్తే అక్కడ చేసేందుకు సిద్ధంగా ఉన్నాను.

తెలుగు సినిమాల కంటే తమిళ నిర్మాతలు నాకు ఎక్కువగా డబ్బులు ఇస్తున్నారు. అందువల్ల అక్కడే ఎక్కువగా చేస్తున్నాను. నాకు భాష గురించి పట్టింపు లేదని, కావాల్సిందంతా.. అవకాశాలు, డబ్బులేనని రీమాసేన్ ఏ మాత్రం తడుముకోకుండా సమాధానం చెపుతోంది.
About Writer
PNR