1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

త్రివిక్రమ్ చిత్రంలో అతిథి పాత్రలో కమిలిని ముఖర్జీ

తెలుగు హీరోయిన్లలో ఓ మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కమిలిని ముఖర్జీ.. త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్న తాజా
తెలుగు హీరోయిన్లలో ఓ మంచి హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న కమిలిని ముఖర్జీ.. త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్న తాజా చిత్రంలో అతిథి పాత్రను పోషించనుంది. ఈ చిత్రంలో ప్రధాన హీరోయిన్‌గా ఇలియానను ఎంపిక చేశారు. ఇప్పటికే తమిళ దర్శకుడు చేరన్ తీసే చిత్రంలో హీరోయిన్ అవాకాశాన్ని కోల్పోయిన కమిలిని త్రివిక్రమ్ చిత్రంలో గెస్ట్ పాత్రలో నటించే అవకాశం లభించడం కొంత ఊరట కలిగించే అంశం.

అయితే చేరన్ చిత్రంలో అవకాశాన్ని కోల్పోవడానికి గల కారణాలు మాత్రం తెలియలేదు. అయితే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుడితో కమిలిని ప్రేమాయణం సాగిస్తోందని, ఆయన్ను పెళ్లి కూడా చేసుకునేందుకు కమిలిని అంగీకరించినట్టు వినికిడి. అందుకే చేరన్ చిత్రంలో అవకాశం కోల్పోయినట్టు టాలీవుడ్ వర్గాలు పేర్కొంటున్నాయి.
About Writer
PNR