1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

నమిత అభిమానుల ఎదురుచూపులు...!

చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యే హీరోయిన్లు అవకాశాల కోసం తమ అందచందాలను సంపూర్తిగా ఆరబోయడానికి సిద్ధమవుతారన్నది
WD PhotoWD
చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యే హీరోయిన్లు అవకాశాల కోసం తమ అందచందాలను సంపూర్తిగా ఆరబోయడానికి సిద్ధమవుతారన్నది జగమెరిగిన సత్యం. అయితే.. అలాంటి అవకాశాలే ఒక్కటిగా లేనపుడు ఆంగ్ల చిత్రాల్లో నగ్నంగా నటించేందుకు కూడా సై అంటారు. ఆ కోవలోనే తమిళంలో హాట్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన నమిత.. ప్రస్తుతం చిక్కుల్లో చిక్కుందని చెన్నై కోడంబాక్కం వర్గాలు పేర్కొంటున్నాయి.

లోగడ సినీ అవకాశాలు గగనంగా మారిన సమయంలో 'మాయ' అనే ఆంగ్ల చిత్రంలో నటించేందుకు నమిత అంగీకరించిట. ఇందులో ఆమె 90 శాతం నగ్నంగా నటించిందని వినికిడి. ఇంతలో ఆమెకు ఇటు తమిళం, అటు తెలుగు భాషల్లో అవకాశాలు రావడంతో ఆంగ్ల చిత్రంలో నటిచేందుకు నిరాకరించిందట. అయితే ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చిత్రాన్ని పూర్తి చేసి తీరాల్సిందేనని చిత్ర దర్శకుడు గొడవ చేస్తున్నారట.

ఇందుకు నమిత మాత్రం ససేమిరా అనడమే కాకుండా.. ఇప్పటికే షూట్ చేసిన సన్నివేశాలను కూడా పూర్తిగా తొలగించాలని నమిత దర్శకుడుని వేడుకుంటుందని కోడంబాక్కం వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే.. హాట్ హీరోయిన్ నమిత అభిమానులు మాత్రం.. ఆ ఆంగ్ల చిత్రం ఎపుడు విడుదలవుంతా అని ఎదురుచూస్తున్నారట.
About Writer
PNR