1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

ఇకపై.. లేడీ జేమ్స్‌బాండ్ పాత్రలో త్రిష..!

తెలుగులో లేడీ జేమ్స్‌బాండ్‌ పాత్రలు పోషించి మంచి గుర్తింపు పొందిన హీరోయిన్ విజశాంతి. ఆమె బాటలోనే గ్లామర్ క్వీన్ త్రిష
WD PhotoWD
తెలుగులో లేడీ జేమ్స్‌బాండ్‌ పాత్రలు పోషించి మంచి గుర్తింపు పొందిన హీరోయిన్ విజశాంతి. ఆమె బాటలోనే గ్లామర్ క్వీన్ త్రిష పయనించనుంది. తనకున్న గ్లామర్ ముద్రను చెరిపేసుకుని, ఎలాంటి పాత్రనైనా చేయగలనని నిరూపించుకోవాలని త్రిష తహతహలాడుతోంది. ఇందుకోసం తనను లేడీ జేమ్స్‌బాండ్‌గా చూపించగలిగే దర్శకుడి కోసం అన్వేషించాల్సిందిగా తన మేనేజర్‌ను త్రిష ఆదేశించిందట.

కేవలం హీరోల పక్కన గంతులు వేసే పాత్రలే కాకుండా.. అప్పుడప్పుడు యాక్షన్ పాత్రలు ధరించాలని తన ఫ్యాన్ క్లబ్స్ నుంచి త్రిషకు పలు అభ్యర్ధనలు వస్తున్నాయట. వారి విజ్ఞప్తి మేరకు జేమ్స్‌బాండ్ చిత్రాల్లో నటించేందుకు సన్నాహాలు చేస్తోందట.

ఇందులోభాగంగా ఒక దర్శకుడు త్రిషకు ఓ లేడీ జేమ్స్‌బాండ్ కథను విన్పించినట్టు సమాచారం. ఈ యాక్షన్ భరిత చిత్రాన్ని తొలుత తెలుగులోనే తీసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాను ఎప్పటి నుంచో కలలు కంటున్న పాత్ర నచ్చడంతో పారితోషకాన్ని సైతం తగ్గించుకునేందుకు త్రిష సిద్ధమైందట.
About Writer
PNR