పెళ్లికి మనసు నచ్చినవాడు కావాలిగా...!!!
Publish: Wed, 21 Nov 2007 (18:59 IST)
Updated: Wed, 21 Nov 2007 (18:19 IST)
"
ఖడ్గం" సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చిన అందాల ముద్దుగుమ్మ సంగీతను పెళ్ళెప్పుడని అడిగితే... మనసుకు నచ్చిన వాడు కావాలిగా అంటోంది. తమిళంలో ప్రముఖ దర్శకుడు బాల దర్శకత్వంలో "విక్రమ్" చెంతన 'శివపుత్రుడు' సినిమాలో నటించిన సంగీత తెలుగులో "బహుమతి", 'పెళ్ళాం ఊరెళితే..', 'ఈ అబ్బాయి చాలా మంచోడు' వంటి చిత్రాల్లో నటించిన విషయం తెలిసిందే. కోలీవుడ్, టాలీవుడ్‌లలో చర్చనీయాంశ పాత్రలను పోషించేందుకు ఆసక్తి చూపుతున్న సంగీతకు సొంత ఊరేదో తెలుసా చెన్నైఅట. మరి నాకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం, ఇంగ్లీష్ భాషలొచ్చని గొప్పగా చెబుతోంది. ప్రస్తుతం ఈమె తెలుగులో "ఓరి నీ ప్రేమ బంగారం కాను" చిత్రంలో నటిస్తోంది. పెళ్ళి సంగతి అడిగితే మనసుకు నచ్చినవాడు దొరకాలని... బోల్డ్‌గా, జోవియల్‌గా, ఫ్రెండ్లీగా ఉండేవాడు దొరకాలని నిర్మొహమాటంగా చెపుతోందట.