గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » తదుపరి చిత్రంలో "వెంకీ" డబుల్ రోల్?
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
Venkatesh
WD PhotoWD
టాలీవుడ్‌లో తనకంటూ పేరును సంపాదించుకున్న విక్టరీ వెంకటేష్‌ తదుపరి చిత్రంలో డబుల్ రోల్స్‌ను పోషించనున్నట్లు చిత్ర యూనిట్ వర్గాల సమాచారం. బోయపాటి శ్రీను దర్శకత్వంతో తెరకెక్కిన "తులసి" చిత్రాకు అనంతరం వెంకీ మరో చిత్రంలో డబుల్ రోల్స్ పోషించనున్నట్లు విశ్వసనీయ వర్గాల బోగట్టా.

అయితే ఈ విషయంపై వెంకటేష్ ఎటువంటి ప్రకటన చేయలేదు. 'లక్ష్మీ', 'ఆడవారి మాటలకు అర్థాలే' వేరులే వంటి సెంటిమెంట్ చిత్రాల్లో నటించిన ఆయన డబుల్స్ రోల్స్‌ చేస్తున్నట్లు టాలీవుడ్ వర్గాల నుంచి వార్తలొచ్చాయి.

ఈ నేపథ్యంలో వెంకి డబుల్ రోల్స్ చిత్రానికి స్క్రిఫ్ట్ కుదిరిందని, రామానాయుడు స్టూడియో షూటింగ్ ప్రారంభం కానుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలు ద్విపాత్రాభినయంతో వచ్చే సినిమాలు చాలా తక్కువైన సంగతి తెలిసిందే. ఈ సందర్భంలో "వెంకీ" డబుల్ రోల్స్‌తో ప్రేక్షకులకు ఆకట్టుకుంటాడా? అనేది వేచి చూడాల్సిందే.