గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » మమత బరువుపై రసవత్తర చర్చ..
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
అటు గాయనిగా, ఇటు నటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ మమతా మోహన్‌దాస్. తాజాగా ఆమె నటించిన చిత్రం "కృష్ణార్జున" ఆశించిన మేరకు విజయం సాధించలేక పోయింది. ఈ చిత్రంలో విష్ణుకు జోడీగా నటించింది. అయితే ఈ చిత్రం షూటింగ్‌లో ఆమె పలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు సమాచారం. ముఖ్యంగా విష్ణుతో సరితూగే విధంగా ఉండేందుకు మమత చేత దర్శకుడు పి.వాసు భగీరథ ప్రయత్నమే చేయించారట. పాత్రకు తగిన విధంగా మమతను చూపించేందుకు బరువు పెరగాలని దర్శకుడు చెప్పారు.

అంతేకాదు సుమా... దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ కనపరచి మమత బరువును పెంచారట. అదే సమయంలో మరో చిత్రంలో నటిస్తున్న ఈ భామకు అక్కడ నటించేందుకు బరువు తగ్గించాల్సి వచ్చింది. ఇలా ఇద్దరి దర్శకుల మధ్య మమత అష్టకష్టాలు పడి.. విజయవంతంగా ఒక చిత్రాన్ని పూర్తి చేసింది. ఇంతకీ... మమత బరువు మాత్రం ఎంతో ఇరు చిత్రాల యూనిట్ సభ్యులు మాత్రం ఖచ్చితంగా చెప్పలేక పోతున్నారు. ఆమె బరువు తెలుసుకోవాలంటే.. దర్శకులను అడగాల్సిందే మరి.