బాలీవుడ్డ మూవీ మొఘల్ యష్ చోప్రా తనయుడు, దర్శక నిర్మాత ఆదిత్యా చోప్రా, బాలీవుడ్ సుందరీమణి రాణీ ముఖర్జీల వివాహం ఖాయమని తెలుస్తోంది. ఆ దిశగా వారి అడుగులు, కదలికలు వేగంగా సాగుతున్నాయి. ఇందులోభాగంగా రాణీకి ఆదిత్యచోప్రా వెడ్డింగ్ రింగ్‌ను ప్రజెంటేషన్ చేసినట్టు బాలీవుడ్‌లో వదంతులు కోడై కూస్తున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఆదిత్యా చోప్రా తన భార్య పాయల్‌కు విడాకులు ఇవ్వగా.. దానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇటీవలే ఇచ్చింది. దీంతో ఆదిత్య-రాణీల వివాహం ఖాయమని బాలీవుడ్ వర్గాల సమాచారం.
అయితే పాయల్‌కు ఆదిత్య విడాకులు ఇవ్వడాన్ని యష్ చోప్రా కుటుంబ సభ్యులకు ఏమాత్రం ఇష్టం లేదు. ఒక వేళ పాయల్‌ను కాదని రాణీని ముఖర్జీని పెళ్లి చేసుకుంటే.. అది తమ అభీష్టానికి వ్యతిరేకంగా జరిగిన వివాహంగానే భావిస్తామని యష్ చోప్రా బహిరంగానే ప్రకటించారు. దీంతో ఆదిత్య తన నివాసాన్ని వదిలి ముంబైలోని ఒక నక్షత్ర హోటల్‌లో వుంటున్నారు.
ఈ పరిస్థితుల్లో హోటల్ గదికి వెళ్లిన రాణీ ముఖర్జీకి ఆదిత్య ఉంగరం కానుకగా ఇచ్చి, దాన్నే వెడ్డింగ్ రింగ్‌గా చెప్పినట్టు సమాచారం. ఇదిలావుండగా.. ఆదిత్య వ్యక్తిగత జీవిత విశేషాలపై స్పందించేందుకు ఆయన సన్నిహితులు ఏ మాత్రం ఇష్టపడటం లేదు. అదంతా ఆయన వ్యక్తిగత జీవితమని, ఆదిత్య-రాణీలకు సంబంధించిన ఏ విషయాన్ని తాము ధృవీకరించలేమని స్పష్టం చేశారు.
|