ప్రధాన పేజి > వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వచ్చే ఏడాది "చిరుత" వివాహం?
FileFILE
మెగాస్టార్ చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ తేజ వివాహం వచ్చే ఏడాది జరుగనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ విషయంపై ప్రస్తుతం ఫిల్మ్‌నగర్ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. రాయలసీమకు చెందిన ఒక పేరుపొందిన వ్యాపారవేత్త కుమార్తెతో రామ్‌చరణ్ పెళ్లి జరిగే అవకాశముందని ఫిల్మ్‌నగర్‌ వర్గాల తాజా సమాచారం. ఆ వ్యాపారవేత్తకు పలు సాఫ్ట్‌వేర్ సంస్థల్లో భాగస్వామ్యం ఉందనీ, పేరుపొందిన నగరాల్లో కొన్ని బడా హోటళ్లలో భాగస్వామిగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయన ఏకైక కుమార్తె ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతోందనీ, ఆ కుటుంబం చిరంజీవి కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్నట్టు తెలుస్తోంది.

కొద్ది రోజుల క్రితం 'చిరుత' హీరోయిన్ నేహా శర్మను రామ్‌చరణ్ రహస్య వివాహం చేసుకున్నట్టు వచ్చిన వార్తలు రాష్ట్రంలో పెను సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. అయితే వీటిని రామ్‌చరణ్ స్వయంగా ఖండించడమే కాకుండా.. తన వివాహం అత్యంత వైభవంగా జరుగుతుందని ప్రకటించారు. మెగాస్టార్ కుటుంబంలోని ఇద్దరు కుమార్తెలకూ వివాహమైంది. ఇక ఆ కుటుంబంలో మిగిలిన రామ్‌చరణ్ పెళ్లిపై చిరు కుటుంబ సభ్యులతో పాటు.. బంధువులు ఆలోచిస్తున్నట్టు సమాచారం. మొత్తం మీద అన్నీ అనుకూలిస్తే 2009లోగా రామ్‌చరణ్ పెళ్లికొడుకయ్యే మెండుగా ఉన్నట్టు ఫిల్మ్ నగర వర్గాల తాజా సమాచారం.
మరిన్ని
ప్రత్యేక ఆకర్షణగా బాలీవుడ్ "ప్రేమజంట"
ఫర్జానా.. భువనేశ్వరి చెరో పది... ఉదయభాను ఆరు లక్షలు
"స్లిమ్ సెక్సీ గర్ల్‌" కోసం సిమ్రాన్ కసరత్తులు
అల్లు అర్జున్ సరసన త్రిష
విడాకులు కోరిన ప్రకాష్ రాజ్
"ఓం శాంతి ఓం" ముద్దుగుమ్మ అలిగిన వేళ...