40 లక్షల వ్యయంతోనే చిత్ర నిర్మాణాన్ని పూర్తి గావించే మలయాళ చలన చిత్రరంగంలో లక్షలు ఖర్చుపెట్టడం ఆ చలనచిత్ర రంగంలో రికార్డే. మలయాళంలో సూపర్‌స్టార్స్ అందరూ కలిసి ఒక్క పైసా తీసుకోకుండా నటించే చిత్రం ట్వంటీ 20. మలయాళ చలనచిత్ర కళాకారుల సంక్షేమనిధి కోసం నిర్మిస్తున్న ఈ చిత్రంలో గత వారం అందాల తార నయనతార నటించిన నృత్యాన్ని60 లక్షల వ్యయంతో చిత్రీకరించారు.
ఒకే ఒక్క నృత్యానికి ఇంత ఖర్చవుతుందా ? ముంబై నుంచి ఇందుకొరకు 100 డాన్సర్లు, సెట్ అంతా ఎయిర్ కండీషన్ చేయించారు. బృందా నృత్య దర్శకత్వంలో... రూపొందించారు. మూడేళ్ల తర్వాత మలయాళంలో నర్తిస్తున్న నయనతారకు 5 డ్రెస్ ఛేంజ్‌లు... అంతా మలయాళ యువకథానాయకులు పృథ్వీరాజ్, జయసూర్య, ఇంద్రజిత్, బాబీ, హంబా మధ్య నయనతార నృత్యం చిత్రాలకే హైలైట్ అంటున్నారు. దర్శకుడు జోష్, మల్టీస్టారర్ చిత్రాలకు ఒక అల్టిమేట్‌గా నిలిచే ఈ ట్వంటీ 20 జులై 4న విడుదల కానుంది.
|