ప్రధాన పేజి > వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
రజనీకాంత్ నిరాహారదీక్షలో పాల్గొంటారా?
హోగెనక్కల్ సమస్యపై తమిళనాడు కర్నాటక రాష్ట్రాల మధ్య రేగిన చిచ్చులో తమిళనాడుకు సంఘీభావంగా తమిళ చిత్రపరిశ్రమ శుక్రవారం తలపెట్టిన నిరాహారదీక్షలో రజనీకాంత్ పాల్గొనేది లేనిది అంతుబట్టకుండా ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్యమండలి తమిళనాడుకు మద్దతు తెలుపుతూ సభ్యులందరినీ ఈ నిరాహారదీక్షలో పాల్గొనాలని పిలుపిచ్చింది. బెంగుళూరులో తమిళ సినిమాలను ప్రదర్శిస్తున్న సినిమా హాళ్లపై దాడులకు, హోగెనక్కల్ సమగ్ర జల పథకంపై కర్నాటక వైఖరికి నిరసనగా దక్షిణ భారత చలనచిత్ర వాణిజ్యమండలి శుక్రవారం నిరాహారదీక్షకు పిలుపుచ్చిన విషయం తెలిసిందే.

అయితే కర్నాటకలో పుట్టిన మరాఠీ వ్యక్తి అయిన సూపర్‌స్టార్ రజనీకాంత్ రేపటి నిరాహార దీక్షలో పాల్గొనేదీ లేనిదీ ఇంతవరకూ స్పష్టం కాలేదు. కర్నాటకలోని తమిళులపై కన్నడిగుల దాడులకు వ్యతిరేకంగా రజనీకాంత్ ఈ దీక్షలో పాల్గొనే విషయంపై రజనీకాంత్ ఒక్క మాట కూడా మాట్లాడక పోవడంతో ఉత్కంఠ నెలకొంది.

శుక్రవారం ఉదయం 8 గంటలకు దీక్ష ప్రారంభం కానుండగా అంతవరకు ఈ దీక్షలో రజనీ పాత్ర ఏమిటో స్పష్టం కాదని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే తమిళనాడు చలన చిత్ర వాణిజ్యమండలిలోన సభ్యులై నటీనటులు, సాంకేతిక నిపుణులు, ఇతరులూ ఈ నిరాహార దీక్షలో పాల్గొనాలని మండలి అధ్యక్షుడు గంగాధరన్ ప్రకటించడంలో ఈ మొత్తం ఉదంతంలో కొసమెరుపు. ప్రాంతభేదాలతో నిమిత్తం లేకుండా మండలిలో సభ్యులైన ప్రతి ఒక్కరూ రేపటి నిరాహార దీక్షలో పాల్గొనాలని గంగాధరం పిలుపిచ్చారు.
మరిన్ని
నయనతార నృత్యానికి 60 లక్షలు
ఆగస్టులో "మెగాస్టార్" పాదయాత్ర?
వచ్చే ఏడాది "చిరుత" వివాహం?
ప్రత్యేక ఆకర్షణగా బాలీవుడ్ "ప్రేమజంట"
ఫర్జానా.. భువనేశ్వరి చెరో పది... ఉదయభాను ఆరు లక్షలు
"స్లిమ్ సెక్సీ గర్ల్‌" కోసం సిమ్రాన్ కసరత్తులు