కాసింత వయసు ముదురుతున్నా లేతగా కనిపించే త్రిషకు విజయాలకు కొదవలేదు. తమిళంలో వరసగా నటిస్తూ తెలుగుతెరపై అప్పుడప్పుడు తళుక్కుమనే త్రిషకు ఈ మధ్య అన్నీ వరుస విజయాలే.
రవితేజతో ఈ ఏడాది ప్రారంభంలో వచ్చిన కృష్ణ చిత్రం మంచి విజయాన్ని సాధిస్తే, తమిళంలోనూ విక్రమ్ సరసన నటించిన చిత్రం కూడా మంచి విజయాన్నే సొంతం చేసుకుంది.
దీంతో బాగా బిజీగా ఉన్న త్రిషను మీ పెళ్లెప్పుడు అని ఓ విలేకరి ప్రశ్నిస్తే అప్పుడే నాకు పెళ్లేంటి అని రొటీన్ సమాధానమిచ్చిందట. పోనీ మీకు ప్రేమ అనుభవం ఏదైనా ఉందాని ప్రశ్నిస్తే సినిమాల్లో తప్ప నిజ జీవితంలో ప్రేమ గురించి తనకింకా పరిచయమే కాలేదని అమాయకంగా చెప్పిందట.
అయితే తాను భవిష్యత్‌లో పెళ్లి చేసుకునే వరుడికి మాత్రం అంత పెద్ద అర్హతలేమీ అవసరం లేదని, వరుడు బుద్ధిమంతుడైతే చాలని చెప్పిందట, అంతేనా తనకు కాబోయే వాడు తనను అర్థం చేసుకునేవాడైతే తనకు సంతోషమట.
అదే సమయంలో అతడు అందగాడో, మంచి మేథావి కానవసరం లేదని కూడా త్రిష శెలవిచ్చిందట. ఇంకేం త్రిష చెప్పిన లక్షణాలుండేవారంతా కాస్త సిద్ధంగా ఉండండేం.
|