1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

ఎన్నికలకు సినీ గ్లామర్: వేణుమాధవ్ పోటీ... ?

ఎన్నికల సినీ గ్లామర్ వేణుమాధవ్ పోటీ
WD PhotoWD
రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖరారైన నేపథ్యంలో వాటిని ఎదుర్కోడానికి పలు రాజకీయ పార్టీలు సినీ నటులను తమ పార్టీ అభ్యర్ధులుగా రంగంలో దింపడానికి తయారవుతున్నాయి. ఆ వరుసలో కామెడీ ఆర్టిస్ట్ వేణుమాధవ్ ఈ ఉపఎన్నికల బరిలో దిగనున్నట్టు గుసుగుసలు వినిపిస్తున్నాయి.

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా కరీనగర్ జిల్లా కమలాపూర్ నియోజకవర్గం నుంచి వేణుమాధవ్ రంగంలో దిగుతారని సదరు గుసగుసలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంపై వేణుమాధవ్ మాత్రం ప్రస్తుతానికి నోరు మెదపడం లేదు. అయితే ఆయన పోటీకి దిగేది దాదాపు ఖరారేనని ఆయన సన్నిహితులు బహిరంగంగానే చెబుతున్నారు.

ఒక్క వేణుమాధవ్ మాత్రమే కాక హీరో రాజశేఖర్ భార్య జీవితను కూడా కాంగ్రెస్ పార్టీ బరిలో దించనుందని కూడా మరో వర్గం ప్రచారం చేస్తోంది. అయితే ఈ విషయం సైతం ఇంకా బహిరంగంగా ప్రకటించలేదు. కానీ ఈ విషయాలు నిజమయ్యే సూచనలే అధికంగా కనిపిస్తున్నాయి.

ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఉపఎన్నికలు ప్రతిపార్టీకి ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో ఎవరికి వారు పార్టీ గెలుపుకోసం ఎలాంటి రాజకీయ ఎత్తుగడలకైనా పూనుకుంటారని తెలుస్తోంది. కాబట్టి వేణుమాధవ్, జీవితలు మాత్రమే కాక ఎన్నికలు సమీపించే కొద్దీ మరికొందరు సినీ ప్రముఖులు తెరమీదికొచ్చినా మనం ఆశ్చర్య పోవాల్సిన పనిలేదు.

ఎందుకంటే మనోళ్లు ఎప్పుడు ఏ పార్టీ గొడుగు పట్టేస్తారో, ఏవరి పొత్తుకోసం ఎవరిని విమర్శిస్తారో వారికే తెలియదు కదా. అందుకే రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న వేళ సినిమావారు కూడా ఓట్ల కోసం రోడ్లెక్కే సన్నివేశాలు ముందుంటాయి మరి.
About Writer
Munibabu