గ్లామర్ పాత్రల్లో నటించడం త్రిషకు అలవాటైనా ఇప్పటివరకు ఓ మోస్తరుకు మించి ఎప్పుడూ అంగాంగ ప్రదర్శన మాత్రం చేయలేదనే చెప్పవచ్చు. అందుకే ఇప్పటివరకు త్రిష అందాలను కనులారా చూడాలేకపోయామనుకునే అభిమానులకు ఇది నిజంగా శుభవార్తే.
ప్రభాస్ హీరోగా, త్వరలో రానున్న బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై చిత్రంలో త్రిష తన అందాలని వీలున్నంత ఎక్కువగా బహిరంగం చేసిందట. అంతేనా తమిళంలో హీరో విజయ్‌తో కలిసి నటించిన కురువి అనే చిత్రంలో కూడా త్రిష తన అందాల్ని తెరపై ఆరబోసిందట.
ముఖ్యంగా ఈ చిత్రం కోసం న్యూజిల్యాండ్‌లోని బీచ్‌లలో చిత్రీకరించిన పాటల్లో త్రిష స్విమ్మింగ్ డ్రస్‌లతో కుర్రకారును వెర్రెక్కించే రీతిలో నటించిందట.
కొద్ది రోజుల క్రితం తమిళంలో అజిత్ హీరోగా వచ్చిన బిర్లా చిత్రంలో నయనతార ఇలాగే స్విమింగ్ డ్రస్‌లో అలరించిందని, ప్రస్తుతం త్రిష సైతం అదే దారిలో పయనించబోతోందని తమిళ తంబిలు అంటున్నారు. ఏదేమైనా త్రిష అందాల విందు చేస్తుందంటే ప్రేక్షకులు మాత్రం వద్దంటారా ఏం...
|