1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

తల్లి పాత్రలు పోషించడానికి ఇంకా టైం ఉంది: శ్రేయ

తల్లి పాత్రలు పోషించడానికి టైం ఉంది శ్రేయ
WD PhotoWD
తెలుగు తెరపై అవకాశాలు తగ్గుతున్న సమయంలో శివాజీ చిత్రం ద్వారా మళ్లీ తన పూర్వ వైభవానికి చేరుకున్న శ్రేయ ఇప్పుడు తమిళ సినీ రంగంలో అగ్ర కథానాయకగా కొనసాగుతోంది.

దీంతో శ్రేయపై అక్కడ రూమర్లకి కొదవలేకుండా పోయింది. ఇప్పుడు అక్కడ శ్రేయ ఏం చేసినా అది హాట్ టాఫిక్‌గా మారుతోంది. అలాంటి తరుణంలో ఓ తమిళ చిత్రంలో శ్రేయ తల్లి పాత్ర పోషించనున్నట్టు వార్తలు గుప్పుమన్నాయి.

ఈ విషయం గురించి శ్రేయను సంప్రదిస్తే తల్లి పాత్రలు పోషించాల్సిన అవసరం తనకింకా రాలేదని కొట్టిపారేసింది. అంతేనా తనకు ప్రస్తుతం మంచి ఆఫర్లు వస్తున్నాయని, తాను తల్లి పాత్రలు పోషించాలనుకునేవారు మరో పదేళ్లు ఎదురు చూడాలని శ్రీయ పేర్కొంది.
About Writer
Munibabu