ప్రధాన పేజి > వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
నేను ప్రేమలో పడ్డ మాట నిజమే: విశాల్
Visal
FILE
'ప్రేమ చదరంగం' చిత్రంతో ఎంట్రీ ఇచ్చి 'పందెంకోడి' చిత్రం ద్వారా గుర్తింపు తెచ్చుకున్న విశాల్ మాస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. విశాల్ నటించిందన్నీ తమిళ చిత్రాలే అయినా ఆ చిత్రాలు డబ్బింగ్ కావడంతో తెలుగులోనూ హీరోగా క్రేజ్ సంపాదించారు.

దాంతో తెలుగులో తనకున్న ఇమేజ్‌ను నిలబెట్టుకునే దిశగా స్ట్రెయిట్ చిత్రం చేయాలని విశాల్ నిర్ణయించుకున్నారు. ఆ ప్రకారమే ప్రస్తుతం ఆయన పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తోన్న 'సెల్యూట్' అనే చిత్రం తెలుగు, తమిళ భాషల్లో స్ట్రెయిట్ చిత్రంగా రూపొందుతోంది.

ఇలా తెలుగులోనూ, తమిళంలోనూ మంచి క్రేజ్ సంపాదించిన హీరో విశాల్ ప్రేమలో పడ్డారనే వార్తలు ఆ మధ్య తమిళ ఇండస్ట్రీలో బాగా వినిపించాయి. అంతేనా తన తొలిచిత్రం హీరోయిన్ రీమాసేన్‌తోనే విశాల్ ప్రేమలో పడ్డారంటూ ప్రారంభమైన ఈ వార్తలు అటుపై విశాల్ ఏ హీరోయిన్‌తో కలిసి నటిస్తే వారితో ప్రేమలో పడ్డారని పత్రికల్లో రాసే స్థాయికి వెళ్లాయి.

ఈ వరుసలోనే విశాల్ నయనతారతో ప్రేమలో పడ్డారని కొన్నిసార్లు, ప్రియామణితో ప్రేమలో పడ్డారని కొన్నిసార్లు రాయడం ప్రారంభించారు. అయితే తనపై వస్తున్న ఈ పుకార్లకు సమాధానం చెప్పే రీతిలో విశాల్ తాజాగా ఓ వివరణ ఇచ్చారు. తాను నటించిన ఓ చిత్రం విజయోత్సవ సభలో మాట్లాడుతూ తాను ప్రేమలో పడ్డ మాట నిజమేనని విశాల్ స్వయంగా ప్రకటించారు.

అయితే పత్రికల్లో రాసినట్టు నయనతార, ప్రియామణిలతో మాత్రం తాను ప్రేమలో పడలేదని ఆయన చెప్పుకొచ్చారు. అయితే విశాల్ మాటలు విన్నవారు మాత్రం ప్రేమలో పడ్డ విషయం నిజమైతే ఆయన ప్రేమికురాలెవరో చెప్పేయచ్చు కదా అని విసుక్కొంటున్నారు. విశాల్ తన ప్రేమ విషయాన్ని ఇలా పూర్తిగా చెప్పడం లేదంటే ఆయన ప్రేమికురాలు కచ్చితంగా హీరోయిన్ అయ్యి ఉంటుందని వారు చెప్పుకుంటున్నారు.

ఏది ఏమైనా విశాల్ తనపై పుకార్లకు పుల్‌స్టాప్ పెట్టినట్టే పెట్టి మరో కొత్తరకమైన పుకార్లకు అవకాశం కల్పించారని మరికొందరు అనుకుంటున్నారు.
మరిన్ని
'దశావతారం'పై వీహెచ్‌పీ గరంగరం
'జల్సా' చేస్తున్నా 'పులి'పైనే అభిమానుల ఆశలు
నమితకు నిద్రలేని రాత్రి: కారణం ఏమిటి... ?
నా పేరు మారింది కాస్త గుర్తుంచుకోండి: తమన్నా
దశావతారం పంక్షన్‌లో అసభ్యకర డ్రస్: మల్లికపై కేసు
ఆ వెబ్‌సైట్లకు 'A' నీతి నియమాల్లేవ్