నాగబాబు హీరోగా కోడిరామకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రం సైలెంట్‌గా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రానికి 'అధినాయకుడు' అనే పేరును ఖరారు చేసినట్టు సమాచారం. నాగబాబు హీరోగా ఓ చిత్రం ఎలాంటి ప్రచారం లేకుండా రూపొందుతోందని గతంలో వెబ్‌దునియాలో వచ్చిన సంగతి తెలిసిందే.
అయితే ఈ చిత్రం గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు చెప్పుకోవాలి. ఈ చిత్రానికి పెట్టనున్న 'అధినాయకుడు' టైటిల్ చిరంజీవి తదుపరి చిత్రానికి పెట్టనున్నట్టు ఆమధ్య జోరుగా ప్రచారం జరిగింది. కానీ చిరంజీవి రాజకీయాల్లోకి రానున్నారన్న వార్తల మధ్య ఆయన ప్రస్తుతం ఆయన చిత్రమేదీ షూటింగ్ జరుపుకోవడం లేదు.
దీంతో చిరంజీవికి అనుకున్న ఈ అధినాయకుడు టైటిల్‌ను ప్రస్తుతం ఆయన సోదరుడు నాగబాబు వాడుకోనున్నారని సమాచారం. ఈ చిత్రంలో నాగబాబు పవర్‌పుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటించనున్నారు. గతంలో ఆయన పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఆపరేషన్ దుర్యోధన చిత్రంతో ఆయనకు మంచి పేరు వచ్చిన సంగతి తెలిసిందే.
దీంతో ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రను మరింత గొప్పగా తీర్చిదిద్దనున్నారట. ఈ చిత్రానికి సంబంధిచిన మిగిలిన సంగతులు త్వరలోనే వెల్లడి కానున్నాయి.
|