ప్రధాన పేజి > వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
దీపిక కొంపముంచిన ఆనాటి సంఘటనలు
Depika padukone
WD PhotoWD
బాలీవుడ్‌లో ప్రస్తుతం బిజీగా ఉన్న దీపికాపదుకొనే ఈమధ్య చాలా కోపంగా ఉంటోందట. ఇంతకీ ఆమె కోపానికి కారణం ఏంటంటే అప్పుడెప్పుడో జరిగిన కొన్ని సంఘటనలతో ప్రియుడు రణబీర్ కపూర్‌కు దీపికకు మధ్య తరచూ గొడవలు వస్తున్నాయట.

అసలు కారణం విచారిస్తే గతంలో దీపిక మోడలింగ్ రంగంలో ఉన్నప్పుడు ఉపేన్ పటేల్‌తో కాస్త గరంగరంగా తీసిన ఫోటోలు రణబీర్ చూడడం జరిగిందట. దీంతో రణపబీర్ దీపికపై తిట్లవర్షం కురిపించాడట. అయితే దీపిక సైతం నువ్వేం తక్కువా గతంలో నువ్వు, కత్రినాకైఫ్‌లు చనువుగా తిరగడం నాకు తెలియదా అంటూ నిలదీసిందట.

దాంతో వీరిద్దరూ ప్రస్తుతం ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని బాలీవుడ్ వర్గాల సమాచారం. వీరిమధ్య గొడవ జరగడం మాట అటుంచి దీపిక అనవసరంగా కత్రినాకైఫ్ పేరు వాడుతోందంటూ కొందరు గుసగుసలాడుకుంటున్నారట. ఎందుకంటే ఇప్పుడిప్పుడే సల్మాన్‌తో జోడీకడుతున్న కత్రినాకు దీపిక మాటలు కోపం తెప్పిస్తున్నాయట.
మరిన్ని
అభిమానులను ఆకర్షించడానికి ముమైత్ ప్రయత్నాలు
బిజినెస్‌ కోసం జాన్‌అబ్రహాంతో బిపాషా బిజీబిజీ
నేను ఎవర్నీ ప్రేమించడం లేదు: ప్రియామణి
ఆమె వద్దు... నేనే నీకు ముద్దు: కత్రినా
అసిన్ కోసం అభిమానుల ఎదురుచూపులు
సానియా టచ్‌లో షాహిద్: బాలీవుడ్‌లో పుకార్లు