ప్రధాన పేజి > వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
వరుస విజయాలతో జోరుమీదున్న జెనీలియా  Search similar articles
Jeneliya
WD PhotoWD
సినీరంగంలో ఎవరి అదృష్టం ఎప్పుడు మేలుకుంటుందో తెలియదు కానీ అది కానీ ఒక్కసారి మేలుకుంటే ఇక వారు తిరిగి చూడాల్సిన పనుండదు. ప్రస్తుతం ఇలాంటి స్థితిలోనే ఉంది మన జెనీలియా. ఎందుకంటే ఈ మధ్య జెనీలియా నటించిన చిత్రాలన్నీ వరసగా హిట్టై పోతున్నాయి.

దీంతో తన అదృష్టాన్ని చూచి జెనీలియా సైతం ఆశ్చర్యపోతోందట. ప్రారంభంలో జెనీలియా నటించిన చిత్రాలు ఓ మాదిరిగానో లేక ప్లాపులుగానో ఉండడంతో జెనీలియా మార్కెట్ సైతం ముందుకు వెనక్కు అన్నట్టుగా ఉండేది. అయితే జెనీలియా నటించిన ' ఢీ' చిత్రం హిట్ కావడంతో ఆమె అదృష్టం ఒక్కసారిగా నిద్రలేచినట్టయ్యింది.

ఆ తర్వాత నటించిన 'బొమ్మరిల్లు' చిత్రం సైతం ఘన విజయం సాధించడంతో జెనీలియా పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ఆ చిత్రంలో హాసిని అనే పాత్రలో నటించిన జెనీలియా ప్రేక్షకులకు తెగ నచ్చేసింది. అంతేనా దీంతో గతంలో కంటే అమెకు అభిమానులు సైతం పెరిగారట.

అదేసమయంలో డబుల్ బోనస్‌లా జెనీలియాకు మరో అదృష్టం సైతం కలిసి వచ్చింది. బొమ్మరిల్లు చిత్రాన్నితమిళంలోకి 'సంతోష్ సుబ్రమణ్యం' పేరుతో రీమేక్ చేస్తే అక్కడ కూడా ఆ చిత్రం సూపర్‌హిట్ అయ్యింది. తమిళంలో సైతం హాసినీ పాత్రను జెనీలియానే పోషించింది. దీంతో కోలీవుడ్‌లో కూడా జెనీలియాకు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయట.

'ఢీ' చిత్రం తర్వాత ఆ చిత్ర దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వం వహించిన 'రెడీ' చిత్రంలోనూ జెనీలియానే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం సైతం హిట్ అయితే జెనీలియాకు తెలుగులో సైతం ఆఫర్లు పెరుగుతాయని సినీ పండితులు చెబుతున్నారు.

ఇవన్నీ చూస్తుంటే మొదట్లో చెప్పినట్టు జెనీలియా అదృష్టం మామూలుగా లేవడం కాదు... ఉలిక్కిపడి మరీ లేచినట్టుంది. అందుకే అది అస్సలు నిద్రపోకుండా జెనీలియాకు వరస విజయాల్ని అందిస్తోంది కాబోలు.
మరిన్ని
మలయాళంలో నయనతార స్పెషల్ డాన్స్
సినిమాలకన్నా ఓపెనింగులే ముద్దు: శ్రేయ
దేవిశ్రీ స్నేహితుడు మాత్రమే: మమతామోహన్‌దాస్
నవనీత్‌కౌర్ చెబుతున్న హిట్ కబుర్లు
సిమ్రాన్‌ సినిమా కష్టాలు
నేను మీ చెంతనే ఉన్నా: అశిన్