ప్రధాన పేజి > వినోదం > వెండితెర > గుసగుసలు
సలహాలు/ప్రతిస్పందనలుమీ స్నేహితునికి పంపించుఈ పేజీని ముద్రించు
 
కరీనా ససేమిరా: హన్సికను వరించిన ఛాన్స్  Search similar articles
Hansika
WD PhotoWD
బాలీవుడ్ నాజూకు సుందరి కరీనాకపూర్ కాదన్న ఓ అవకాశం బొద్దుగా, ముద్దుగా ఉండే హన్సికను వరించిందట. దీంతో హన్సిక చాలా లక్కీ అని ఇండస్ట్రీ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. ఇంతకీ విషయమేంటని విచారిస్తే పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందనున్న 'పులి' చిత్రంలో హన్సికకు హీరోయిన్ ఛాన్స్ లభించే అవకాశాలు పుష్కలంగా ఉందన్నదే ఆ వార్త అని తెలిసింది.

'పులి'తో నటించడానికి కరీనా కాదన్న తర్వాత ఆ చిత్ర నిర్మాతలు హన్సికను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఎందుకంటే 'దేశముదురు' తర్వాత ప్రస్తుతం 'కంత్రీ' చిత్రంతో ఈ పదారేళ్ల ముంబయి పాప మళ్లీ తెలుగువారిని పలకరించింది ఇప్పుడే అయినా ఇండస్ట్రీలో హన్సిక అంటే క్రేజ్ తగ్గలేదట. దాంతో 'పులి'కి హీరోయిన్‌గా హన్సికనే ఎంపిక చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయట.

ఇదంతా విన్న ఇతర హీరోయిన్లు కాస్త జెలసీగా ఫీలౌతున్నారట. ఎందుకంటే మెగాహిట్ అయన ఖుషీ చిత్రం తర్వాత దర్శకుడు ఎస్.జే. సూర్యతో కలిసి పవన్ నటిస్తున్న సినిమా ఇదే. అంతేకాదు ఈ చిత్రంలో పవన్ డబుల్ రోల్‌లో కన్పించనున్నడట.

తాజాగా విడుదలైన పవన్ చిత్రం 'జల్సా' హిట్టా కాదా అంటూ ఇంకా కొద్దిమంది వాదిస్తూనే ఉన్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో డిఫరెంట్ స్టైల్‌లో పవన్ నటించే ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి.

అందుకే ఇలాంటి చిత్రంలో హీరోయిన్‌గా ఛాన్స్ అంటే హీరోయిన్లు ఎగిరి గంతేయడం సహజమే కదా. మరి ఈ చిత్రంలో హన్సికకు ఛాన్స్ లభిస్తుందో లేదో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
మరిన్ని
వరుస విజయాలతో జోరుమీదున్న జెనీలియా
మలయాళంలో నయనతార స్పెషల్ డాన్స్
సినిమాలకన్నా ఓపెనింగులే ముద్దు: శ్రేయ
దేవిశ్రీ స్నేహితుడు మాత్రమే: మమతామోహన్‌దాస్
నవనీత్‌కౌర్ చెబుతున్న హిట్ కబుర్లు
సిమ్రాన్‌ సినిమా కష్టాలు