1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

హీరోయిన్ ఛాన్స్ శుద్ధ దండగ

హీరోయిన్ ఛాన్స్ శుద్ధ దండగ
హీరోయిన్ పాత్రలు పోషించాలని తనకు ఏ మాత్రం ఆసక్తి లేదంటోంది సిమ్రన్ కాదు...సిమ్రన్ ఖాన్. గుర్తుందా...మరచి పోయారా? ఈ రోజుల్లో ఉత్తరాది నుంచి లెక్కల్లో చెప్పలేనంతమంది తారలు వచ్చిపోతుంటే ఎలా చెప్పగలమనుకుంటున్నారా?

ఒక్కసారి టాటా, బిర్లా, మధ్యలో లైలా సినిమాను గుర్తు తెచ్చుకోండి. ఇంకా గుర్తుకు రాలేదంటే పొరంబోకు సినిమా...ఓకే తెలిసిందా. తళుక్కుమనే తారలను చూస్తే చాలదు...గుర్తు పెట్టుకోవాలి.

సరే, ఇక విషయాని కొద్దాం. అమ్మడికి హీరోయిన్ ఛాన్సులొద్దట. పెద్ద బ్యానర్‌లో అయితే ఫరవాలేదు కానీ చిన్నా చితక సంస్ధల చిత్రాల్లో అయితే ఆ పాత్రను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేంది లేదంటోంది.

అయితే ఐటమ్ సాంగ్‌లకైతే ఓకే అంటోంది. అదైతే తక్కువ సమయంలో అధిక మొత్తం చేతికి అందడమే కాక తనకు తగినంత విశ్రాంతి లభించగలదని చెబుతోంది. ఎలాగూ తెలుగుతో పాటు తమిళం, కన్నడలలో కూడా నటిస్తున్నందున నెంబర్ వన్ ఐటమ్ గర్ల్ కావాలనుకుంటుందేమో మరి!
About Writer
Srinivasulu