గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » రూమర్లు రాకూడదనే రాత్రిపూట వద్దంటున్నా: భావన
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
ఒంటరితో తెలుగుతెరకు పరిచమయమైన తమిళ సుందరి భావన తొలిచిత్రంతోనే మంచి పేరు తెచ్చుకుంది. ఒంటరిలో గోపీచంద్ సరసన నటించిన ఆమె నటన చూచి ప్రేక్షకులు సైతం మెచ్చుకున్నారు. దాంతో తెలుగులో తనకు మంచి ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉందని భావన సైతం భావిస్తోంది.

అయితే ఒంటరి తర్వాత భావన నటించే చిత్రాలేవీ ప్రస్తుతానికి తెలుగులో లేకపోవడం విశేషం. అయితే ప్రస్తుతం తమిళంలో ఓ మోస్తరు ఆఫర్లతో నెట్టుకొస్తున్న భావన తెలుగులో సైతం తనకు మంచి ఆఫర్లు వస్తున్నాయని వాటి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని అంటోంది.

దీంతో భావన వద్ద విశేషాలేమీ లేవని విలేకరులు బాధపడుతున్న సమయంలో ఓ కొత్త విషయాన్ని భావన చెప్పుకొచ్చిందట. అదేంటంటే... తాను రాత్రివేళ జరిగే ఫంక్షన్‌లకు వెళ్లడానికి ఇష్టపడనని చెప్పిందట. అడక్కుండానే ఇలా చెబుతున్నారు... అసలు విషయమేంటని ప్రశ్నిస్తే రాత్రివేళ జరిగే ఫంక్షన్లకు వెళితే లేనిపోని సమస్యలు వస్తాయని భావన చెప్పుకొచ్చిందట.

అందుకే రాత్రివేళ ఫంక్షన్లకు వెళ్లొద్దని ఆమె స్నేహితులు ఆమెకు సలహా ఇచ్చారట. అందుకే స్నేహితుల మాట మన్నించి తానూ రాత్రివేళ ఫంక్షన్లకు నో చెబుతోందట.

రాత్రివేళ ఫంక్షన్లు వందంటోందంటే పగటివేళ ఫంక్షన్లకు భావన సై అంటోందేమో అని కొందరు అప్పుడే గుసగుసలాడేసుకుంటున్నారట.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: రూమర్లు రాకూడద రాత్రిపూట వద్దంటు భావన