1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

అలా చేస్తే తప్పేంటి అంటున్న ముమైత్

తన అభిమానులను ఆనందపరిచేందుకు ఎలా నటిస్తే ఏమిటని సెక్సీ క్వీన్
FileFILE
తన అభిమానులను ఆనందపరిచేందుకు ఎలా నటిస్తే ఏమిటని సెక్సీ క్వీన్ ముమైత్ ఖాన్ ప్రశ్నిస్తోంది. ముఖ్యంగా 'బేసిక్ ఇన్‌స్టంట్' అనే ఆంగ్ల చిత్రంలో నటి షరాస్టోన్ నటించిన తరహాలో నటించడం తప్పులేదని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. కొత్తదనం కోసం వైవిధ్యమైన పాత్రలు చేయడం తప్పుకాదని అంటోంది. తనకంటూ ప్రత్యేక అభిమానులు, ప్రేక్షకులు ఉన్నారని, వారి ఆనందం కోసం దేనికైనా సిద్ధమని ముమైత్ అన్నారు.

బహుశా ఇదే తరహా పాత్రను ముమైత్ తాజాగా నటిస్తున్న 'టార్గెట్' చిత్రంలో పోషిస్తోంది. శ్రీ సాయిసూర్య మూవీస్ బ్యానర్‌పై దశరథ్ సంగిశెట్టి నిర్మిస్తుండగా, రమేష్ రాజా దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలావుండగా.. ముమైత్ ఖాన్‌పై గతంలో పలు రకాల కథనాలు వచ్చిన విషయం తెల్సిందే. ఆమె సెక్సీ అందాలను కేంద్రంగా చేసుకొని వార్తలు రాస్తుంటారు.

ఓ వైపవీటిపై మండిపడుతూ ఉండే ముమైత్ మరో వైపు నగ్నంగా లేదా అర్థనగ్నంగా నటిస్తానని సంచలన ప్రకటనలు చేస్తుంటారు. దటీస్ ముమైత్. కాగా, కొత్త చిత్రంలోని తన పాత్ర కోసం ముమైత్ తన బాడీ అందాలను చాలా వరకు తగ్గించారు. దీంతో ప్రస్తుబరువు 65 కేజీలకు తగ్గినట్టు ముమైత్ అంటున్నారు.
About Writer
PNR