1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

''సంతృప్తి'' పరిచే ''మగాడు'' దొరకాలి: జగన్మోహిని

'సంతృప్తి' పరిచే 'మగాడు' దొరకాలి: జగన్మోహిని

నా అందానికి తగినవాడు కావాలి


ఒకవైపు తన వంపుసొంపు వయ్యారాలను ఒలకబోస్తూ, మరోవైపు అంగాంగ ప్రదర్శన చేస్తూ కుర్రకారును మత్తెక్కిస్తున్న నేటితరం 'జగన్మోహిని'... నమిత. తమిళం, తెలుగు భాషల్లో సెక్సీక్వీన్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకు అభిమానులు ఎక్కువే. తమిళ అభిమానులైతే.. ఏకంగా కోయబంత్తూరు, మదురైలలో గుడులు కూడా కట్టారు.

నాపై ప్రేమను కురిపించాలి

దీనిపై పలుమార్లు స్పందించిన నమిత... అభిమానులకు తనపై ఉన్న 'ప్రేమా'భిమానాలే ఇవన్నీ చేపిస్తున్నాయని పేర్కొంటూ తెగ సంబరిపడి పోయింది. బాయ్‌ఫ్రెండ్‌ను ఎపుడూ వెంటబెట్టుకుని తిరిగి ఈ పొడవు కాళ్ళ సుందరి వద్ద పెళ్లి ప్రస్తాన తెచ్చినపుడు.. అపుడే పెళ్లా..! అంటూ ఆశ్చర్యంగా ప్రశ్నిస్తోంది. ఇపుడే పెళ్లి ప్రస్తావన తేవొద్దని నిక్కచ్చిగా చెపుతోంది.

బాయ్‌ఫ్రెండ్ వేరు... భర్త వేరు!

తనను అన్ని విధాలా 'సంతృప్తి' పరచగలిగే మగరాయుడు ఇంతవరకు తన కనుచూపులో పడలేదని అందువల్ల తన మదిలో ఆ ఆలోచన రాలేదని నంగనాచిలా పలుకుతోంది. అయితే మీ బాయ్‌ఫ్రెండ్ అనునిత్యం మీ వెంటే ఉంటాడు కదా అని ప్రశ్నించగా.. బాయ్‌ఫ్రెండ్ వేరు, భర్త వేరు.

సంతృప్తిపరిచే పురుషుడు ఎవరో...

బాయ్‌ఫ్రెండ్‌కి, భర్తకు చాలా పోలికలు ఉంటాయని చెపుతోంది. త్వరలో నేటి తరం 'జగన్మోహిని'గా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ శృంగారతారను నవరసభరితంగా సంతృప్తి పరచగలిగే మగాడు ఎవరో. ఇలాంటి మగాడి కోసం నమిత వేయికళ్ళతో వెయిటింగ్ చేస్తోందన్నమాట.
About Writer
PNR