సీనియర్ నటి జయప్రద సోదరుడుగా రజనీకాంత్ నటించిన "అంతులేని కథ" చిత్రం అప్పట్లో సెన్సేషనల్ హిట్. ఆ చిత్రానికి సీక్వెల్ వస్తోందని ఆనాడు ప్రచారం కూడా జోరుగా జరిగింది. కానీ రాలేదు. ఇక పద్మభూషణ్ కమల్ హాసన్ నటించిన "మరో చరిత్ర" చిత్రం కూడా పెద్ద హిట్టే. మళ్లీ ఈ చిత్రానికి కూడా సీక్వెల్ వస్తోందనే వార్తలు ఫిలిమ్ నగర్ వర్గాల్లో వినిపించాయి.
ఏది ఏమైనప్పటికీ ఇన్నాళ్లకు "మరో చరిత్ర" సీక్వెల్‌గా కొత్త చిత్రం రూపొందబోతున్నట్లు తెలిసింది. దీనికి "దిల్"రాజు నిర్మాత సారథ్యం వహిస్తున్నారు. ఈ చిత్రానికి వరుణ్ సందేశ్ హీరోగా ఎంపికైనట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. "రేస్" అనే హిందీ చిత్రానికి పనిచేసిన రవి.సి. యాదవ్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నారు.