1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు

మణిరత్నం "రావణ"కు కష్టాలు

రావణ మణిరత్నం రాముడు సీత ఐశ్వర్యారాయ్ విక్రమ్ అభిషేక్
మణిరత్నం ఎంతో కష్టించి హిందీ, తమిళ భాషల్లో రూపొందిస్తున్న "రావణ"కి కష్టాలు ఎదురయ్యాయి. ఆర్థిక మాంద్యం దెబ్బతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న రిలయన్స్ బిగ్ పిక్చర్స్ కాస్ట్ కటింగ్ చేసి సినిమాను చుట్టేయమంటూ మణిరత్నానికి చెప్పినట్లు విశ్వసనీయ సమచారం.

రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌తో చిత్రాన్ని నిర్మించడం తమకు మోయలేని భారంగా మారిందనీ, కనుక బడ్జెట్‌లో 50 శాతం కోత విధించి రూ.60 కోట్లలో చిత్రాన్ని చుట్టేయమని ఓ ఉత్తరం ముక్క రాసినట్లు తెలిసింది. అయితే కథ ప్రకారం అంచనా వ్యయాన్ని తగ్గించి తీస్తే చిత్రం తేలిపోతుందని మణిరత్నం ఆలోచనలో పడ్డాడట.

ఒకవేళ వీరిని కాదని మరో నిర్మాత వద్దకు వెళ్లాలన్నా ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం అందరినీ పీడిస్తుందాయే. ఏమీ పాలుపోని రత్నం చివరికి కాస్ట్ కటింగ్‌పైనే దృష్టి పెట్టినట్లు కోలీవుడ్ సమచారం.

ఈ చిత్రంలో సీతగా అందాల తార ఐశ్వర్యారాయ్, రామునిగా విక్రమ్, రావణునిగా ఐశ్వర్య భర్త అభిషేక్ నటిస్తున్నారు. రావణునిగా అభిషేక్ సూపర్బ్‌‍గా నటిస్తున్నాడని ఐశ్వర్యారాయ్ అంటోందట. మరి నిజ జీవితంలో భర్త పాత్రలో ఎలా ఉంటున్నాడో... ఏమో...
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT