అక్కినేని నాగార్జున కుమారుడు నాగచైతన్య తాజా చిత్రం షూటింగ్ విశాఖలో జరుగుతోంది. ఈ షూటింగ్ మార్చి నెలాఖరు వరకు జరుగుతుందని యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది. వాసువర్మ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రంలో ప్రముఖ హీరోయిన్ కుమార్తె నటించనుందని టాలీవుడ్ వర్గాల సమాచారం. ఇప్పటికే నాగ చైతన్య సరసన నటించే హీరోయిన్ ఎంపిక చేశారని, అయితే ఎవరనే విషయాన్ని, హీరోయిన్ పేరును ప్రముఖ నిర్మాత దిల్‌రాజు సస్పెన్స్‌లో పెట్టారని సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.
మరోవైపు... శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రంలో, దిల్‌రాజు నిర్మాణ సారథ్యంలో తెరకెక్కిన "కొత్తబంగారులోకం" హీరోయిన్ శ్వేతబసును ఎంపిక చేసినట్లు సమాచారం.
లవ్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగే ఈ చిత్ర కథకు నాగార్జున కొన్ని సలహాలు కూడా ఇచ్చాడని సినీ వర్గాల్లో టాక్. ఏది ఏమైనా.. తండ్రి సలహాలు ఎలాగో నాగార్జునకు ఉపయోగపడలేదు. మరి నాగచైతన్యకు.. నాగార్జున సలహాలు ఎంతవరకు ఉపయోగపడతాయో వేచి చూడాల్సిందే..!