గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » రణ్‌బీర్‌తో ప్రియాంక చోప్రా కొత్త సినిమా! (Priyanka Chopra with Ranbir!)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
IFM
బాలీవుడ్ అందాల తార, మాజీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా, తన తదుపరి చిత్రంలో రణ్‌బీర్ కపూర్‌తో జత కట్టనుందని సమాచారం. ప్రస్తుతం ఉదయ్ చోప్రాతో యాష్ రాజ్ ఫిలింస్ "ప్యార్" చిత్రం షూటింగ్‌లో బిజీ బిజీగా ఉంటోన్న ప్రియాంక, ప్రముఖ నిర్మాత సజీద్ నాడియావాలా నిర్మించే కొత్త చిత్రంలో నటించనుందని సినీ వర్గాల్లో వార్తలు షికార్లు చేస్తున్నాయి.

ఇప్పటికే.. బాలీవుడ్ హాటెస్ట్ హీరోస్, ఖాన్ సూపర్ స్టార్స్‌తో అనేక సినిమాల్లో నటించిన ప్రియాంక, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, హృతిక్ రోషన్ వంటి యంగ్ హీరోలతోనూ నటించింది. అదేవిధంగా "కామ్ని" సినిమాలో సాహిద్ కపూర్‌తోనూ నటించిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో.. బాలీవుడ్ కొత్త జనరేషన్ కథానాయకులతో కూడా ప్రియాంక జత కట్టేందుకు సిద్ధమవుతోందని బాలీవుడ్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇందులో భాగంగా.. రణ్‌బీర్ కపూర్‌తో "ఎ రామ్-కామ్" పేరిట రూపుదిద్దుకోనున్న తాజా చిత్రంలోనూ ప్రియాంక కీలక పాత్ర పోషించనుంది. ఈ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించగా, నాడియావాలా నిర్మాణ సారథ్యం వహిస్తున్నారు.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: వినోదం వెండితెర గుసగుసలు రణ్బీర్ ప్రియాంక చోప్రా కొత్త సినిమా ప్యార్ ఎ రామ్కామ్ నాడియావాలా సిద్ధార్థ్ ఆనంద్