1. వినోదం
  2. »
  3. తెలుగు సినిమా
  4. »
  5. గుసగుసలు
  6. బ్రెట్‌లీతో ప్రీతి జింటా డేటింగ్?

Preity Zinta admits she is single | బ్రెట్‌లీతో ప్రీతి జింటా డేటింగ్?

వినోదం
WD
బాలీవుడ్ అందాల రాశి, పంజాబ్ కింగ్స్ యజమాని ప్రీతి జింటా ఈ మధ్య సింగిల్‌గానే తిరుగుతోందట. తన ప్రేమికుడైన నెస్ వాడియాతో కాస్త దూరంగానే కన్పిస్తున్న జింటా.. ఆస్ట్రేలియా బౌలర్ బ్రెట్‌లీ డేటింగ్ జరుపుతోందని సినీ వర్గాల్లో వార్తలు గుప్పుమన్నాయి.

ఐపీఎల్‌ రెండో సీజన్‌తో తెగ బిజీబిజీగా ఉంటోన్న జింటా.. కనీసం వాడియా పక్కన కూడా కూర్చోనంటోందట. ఎప్పుడూ జట్టు సభ్యులతో ఉంటూ చిందులేస్తూ కన్పిస్తోన్న జింటాకు వాడియా దూరమవుతున్నాడని సినీ వర్గాల సమాచారం.

ఇదిలా ఉండగా.. తాను ఓ నటుడిని కాకుండా.. ఓ మగాడిని పెళ్లి చేసుకుంటానని ప్రీతి జింటా ఇటీవల ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. ఈ మగాళ్ల జాబితాలో పంజాబ్ కింగ్స్ క్రికెటర్లు ఎవరైనా ఉన్నారేమో? అని బాలీవుడ్ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. మరి ప్రీతి మెచ్చిన మగధీరుడెవరో? వేచి చూడాల్సిందే..!
About Writer
SELVI.M