ఐటమ్ గాళ్ రాఖీ సావంత్ తన స్టేట్మంట్లతో ఎప్పటికప్పుడు వార్తలకు ఎక్కుతుంటుంది. "రాఖీ సావంత్ కా స్వయంవర్" పేరిట పలేషియల్ హోటల్స్‌లో ఇటీవల నిర్వహించిన రియాలిటీ షోలో పోటీదారులైన 16మందిని పెళ్లాడుతానని సంచలన వ్యాఖ్య చేసింది.
అదేమంటే... తనకు మహాభారతంలోని ద్రౌపది ఆదర్శమని అంటోంది. ఆ 16మంది పోటీదారులు ఎంతో ప్రతిభావంతులనీ, వారిలో ఏ ఒక్కరినీ వదిలిపెట్టలేననీ అంటోంది.
"అదిసరే ఆ 16మందిలో ఎవరు నీకు ఫేవరెట్" అని అడిగితే, 16మంది మగాళ్లనూ ఇష్టపడుతున్నాని చెప్పింది. రాఖీ మాటలకు ఆ 16 మంది గుండెలు ఒక్కసారి ఝల్లుమన్నాయట. తను అన్నట్లుగానే ఆ 16 మంది అంగీకరిస్తే భార్యగా అవతారమెత్తి మరో సంచలనాన్ని సృష్టించినా ఆశ్చర్య పోనక్కర లేదు.
ఇటువంటి "వేడి" మాటలు మాట్లాడబట్టే అప్పట్లో ఒక బాలీవుడ్ హీరో ఏకంగా రెండు నిమిషాల పాటు రాఖీ పెదవులను వదలకుండా ముద్దుపెట్టుకున్నాడు.