గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » వదలమన్నా వదలడే.. దొంగసచ్చినోడు: సోహా (Soha Ali khan | Kunal Khemu | love affair)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
FILE
మొన్నటివరకూ పీకల్లోతు ప్రేమలో ఈదులాడి, ఆనక ఆ ఈత చాలునని తలచిన బాలీవుడ్ సెక్సిణి సోహా అలీఖాన్ తన బాయ్‌ఫ్రెండ్‌కు చేయిచ్చేస్తున్నట్లు తన సన్నిహితుల వద్ద చెప్పిందట. ఈ బుల్లిమాటే సదరు ప్రేమజీవి కునాల్ ఖేముకు తెలియడంతో సోహా ఎప్పుడు బయటకు వస్తుందా అని ఆమె ఇంటికి సమీపంలో కాచుక కూచున్నాడట.

అలా అతను చూస్తుండగానే కారులో సర్రున బయటకు వచ్చిందట సోహా. అంతే.. కునాల్ ఆమెను వెంబడించడం మొదలుపెట్టాడట. తన బైకును సోహా డ్రైవ్ చేస్తున్న కారు అద్దం దగ్గరగా తీసుకువచ్చి "మనమిద్దరం "99" సినిమాలో రెండు తొమ్మిదుల్లా ఎంతో కలిసిపోయాం. ఇంతలో నీకేమైందీ..." అంటూ పెద్దగా అరుస్తూ బైక్‌పై ఫాలో చేస్తూనే ఉన్నాడట.

ఇంతలో రెడ్ సిగ్నల్ పడటంతో సోహా తన కారును ఆపిందట. బాయ్‌ఫ్రెండ్ కునాల్ సోహాకు దగ్గరగా వెళ్లబోతుండగా ఆమె కసిరిందట. అరిచి నానా యాగీ చేసిందట. దాంతో అతడి ముఖం కందగడ్డలా మారిపోయిందట. సోహా ఇచ్చిన కిక్‌కు డక్కైన కునాల్ కిమ్మనకుండా వెనుదిరగాడట.

ఇంతకీ సోహా తన బాయ్‌ఫ్రెండ్‌ని ఏమని కసిరి ఉంటుందీ... అని ఆరా దీస్తే, రోడ్‌సైడ్ రోమియోలను కొందరు అమ్మాయిలు "పోరా దొంగ సచ్చినోడా..." అని ఎలా కసురుతారో అలా కసిరిందని ఆ ప్రక్కనే ఉన్నవాళ్లు చెప్పుకొచ్చారు. ప్రేమ ఫలిస్తే మన్మథుడు.. వికటిస్తే దొంగసచ్చినోడు...
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: సోహా అలీఖాన్, బాయ్ ఫ్రెండ్, కునాల్, ప్రేమ