1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. sister

Ileana | sister | cinema chance | Puri Jagannath | Simbu | ఇలియానా అక్కా.. నాకు సినిమా ఛాన్స్ ఇప్పించవూ...

ఇలియానా
ఇలియానా తన చెల్లెల్ని చిత్ర పరిశ్రమకు పరిచయం చెయ్యటానికి తెగ ఆరాటపడిపోతోంది. ప్రముఖ హీరోలు, దర్శకుల కాంబినేషన్‌లో సహోదరిని నటింపజెయ్యాలని ప్రయత్నాలు సాగిస్తోందట. ఈ ప్రయత్నంలో ఇలియానా సఫలమైనట్లు టాలీవుడ్ సినీజనం అనుకుంటున్నారు.

టాలీవుడ్‌లో పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో చెల్లెల్ని నటింపజేసేందుకు క్లియర్ రూట్‌‌ను ఏర్పరిచిందట. కానీ ఆ సినిమా ఆలస్యం అయ్యే అవకాశాలు కన్పిస్తున్నాయి. అందువల్లనో ఏమోకానీ తన చెల్లెల్ని తమిళ వెండితెరకు పరిచయం చేయాలని నిశ్చయించుకుందట.

తాజాగా శింబు నటించే చిత్రంలో కథానాయికగా తన చెల్లెల్ని రికమండేషన్‌ చేసిందట. కాకపోతే సెకండ్ హీరోయిన్‌గా పెట్టమని చెప్పిందట. అలాగే భారీగానే పారితోషికం కావాలని అడిగిందట. దానికి శింబు కూడా ఒప్పుకున్నాడని సమాచారం.

అయితే ఇలియానా సోదరి తెలుగులో అవకాశంకోసం ఉవ్విళ్లూరుతోందట. ఎలాగైనా టాలీవుడ్‌లో ఛాన్స్ ఇప్పించమని అక్కను మొహమాటపెడుతోందట. మరి ఇలియానా అక్క సాధిస్తుందో... లేదో...?
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT