గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » బాలీవుడ్‌లో గోళ్లు గిల్లుకుంటున్న అసిన్ (Asin | Actress | Bollywood | Tollywood | Kollywood)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
IFM
హిందీ గజినీతో బాలీవుడ్ నిర్మాతల దృష్టిని ఆకర్షించిన అసిన్, ఆ తర్వాత అవకాశాలను బాగానే సాధించుకుంది. ఆ ఊపుతో టాలీవుడ్, కోలీవుడ్ నిర్మాతలు ఎంత పిలిచినా విననట్టు వదిలేసింది. పిలిచీ పిలిచీ విసుగెత్తిన టాలీవుడ్, కోలీవుడ్ సినీజనం మిన్నకున్నారు.

ఇప్పుడేమో హిందీలో ఒప్పుకున్నవి కొన్ని ఆగిపోవడం... మరికొన్ని వాయిదా పడడంతో ఏం చేయాలో తోచక అక్కడ గోళ్లు గిల్లుకుంటూ కూచుందట. తమ పక్కింట్లో ఎవరైనా పిల్లలు ఖాళీగా ఉంటే వారితో పిల్లాటలు ఆడుకుంటోందట.

ఇటీవల అసిన్‌ను పలుకరిద్దామని వెళ్లిన ఓ కోలీవుడ్ నిర్మాత ఆమె పరిస్థితి చూసి జాలిపడ్డాడట. అయితే అదేమీ పట్టించుకోని అసిన్ తాను బాలీవుడ్ సినిమాలతో బిజీగానే ఉన్నానని ఊకదంపుడు కబుర్లు చెప్పిందట. చివర్లో సదరు నిర్మాత బయలుదేరేముందు తను కోలీవుడ్, టాలీవుడ్ నిర్మాతల పిలుపుకోసం ఎదురు చూస్తున్నాని చెప్పమందట.

బాలీవుడ్ కొండలు నునుపు అని భ్రమించిన అసిన్, ముంబైలోనే సెటిలవుదామని అక్కడే ఓ ఇల్లు కూడా కొనుక్కుందట. చెన్నైలో ఉన్న ఇల్లును అమ్మకానికి పెట్టినట్లు సమాచారం.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: అసిన్, బాలీవుడ్, టాలీవుడ్, కోలీవుడ్, సినిమా