గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » విలన్‌గా అవతారమెత్తనున్న నందమూరి హీరో..! (Nandamuri taraka Ratna| Villain| Amaravathi| Shooting| Suspense| Thriller| Political)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
Taraka Ratna
FILE
నందమూరి వంశంలో హీరోలుగా ఎదగాలని ఆశపడుతున్న వారిలో తారకరత్న ఒకరు. ఏకంగా 9 చిత్రాల షూటింగ్‌లు ఒకేసారి జరిపి దిష్టిపోతుందని అనుకున్నా.. అందులో మూడు చిత్రాలు మినహా ఏవీ షూటింగ్‌కు నోచుకోలేదు.

ఆ తర్వాత అరకొర చిత్రాలు చేసినా అంతగా గుర్తింపు రాలేదు. దీంతో ఇక హీరో వేషాలకు స్వస్తి చెప్పి.. విలన్ వేషాలకు సిద్ధమయ్యాడు.

ఇందులో భాగంగా "అమరావతి" అనే చిత్రంలో తారకరత్న విలన్‌గా నటిస్తున్నాడు. అల్లరి రవిబాబు దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రం సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కనుంది. ఈ చిత్రం ద్వారానైనా తనకు గుర్తింపు వస్తుందని తారకరత్న ఆశిస్తున్నాడు.

పొలిటికల్ ఫీల్డులోనూ తనకు ఏమాత్రం గుర్తింపు రాకపోయేసరికి ఇక సినిమాలైనా గుర్తింపునిస్తాయని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాడు. మరి ప్రేక్షకులు తారకరత్నను ఏ మేరకు ఆదుకుంటారో వేచి చూడాల్సిందే..!.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: నందమూరి తారకరత్న, విలన్, అమరావతి, షూటింగ్, సస్పెన్స్, థ్రిల్లర్, రాజకీయం