కలిసి కాఫీ తాగితే "లింకు" పెడతారేమో...? జెన్నీ అనుమానం..!!
WD
ఇండస్ట్రీకి వచ్చాక ఎన్నో విషయాలు నేర్చుకున్నానని జెనీలియా అంటోంది. ఒక వ్యక్తి మనతో పది నిమిషాలు మాట్లాడితే చాలు... అవతలివారు మనల్ని గురించి అంచనాలు వేసేస్తుంటారు. నాక్కూడా ఆ విద్య కాస్త తెలుసు. ఇది కూడా నేను సినిమావాళ్ల దగ్గర నేర్చుకున్నదే. అందుకే మాటల్లో ఎప్పుడూ పొరబడను. ఎదుటి వ్యక్తి స్థాయి.. అన్నింటినీ దృష్టిలో ఉంచుకునే పెదవి కదుపుతానని చెబుతోంది జెనీలియా.
తనపై వచ్చిన ప్రేమ రూమర్లపై చెబుతూ... రితేష్ దేశ్‌ముఖ్‌తో ప్రేమాయణం జరుపుతున్నట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని చెబుతోంది. తామిద్దరూ కలిసి రెండే సినిమాల్లో నటించామని చెప్పింది. ఇలాంటి రూమర్లు వస్తాయనే అతనితో కలిసి కనీసం కాఫీ కూడా తాగలేదని ముసి ముసిగా నవ్వుతూ చెప్పింది జెనీలియా.
అంటే కలిసి కాఫీ తాగితే ప్రేమాయణం మొదలైనట్లేనా..? ఈసారి అడుగుదాం...