పిజ్జా అంటే లొట్టలేయని మోడ్రన్ పీపుల్ ఎవరుంటారు చెప్పండి. పిజ్జా సంగతి సరే... కరీనా హాట్ పిజ్జాలను ఎప్పుడైనా రుచి చూశారా..? ఇప్పుడు ముంబయిలో కరీనా హాట్ హాట్ పిజ్జాలకోసం జనం ఎగబడుతున్నారట. ఇంతకీ ఈ కరీనా పిజ్జాల సంగతేంటీ అనుకుంటున్నారా...?
ఇటీవల ముంబయిలో ఓ యువకుడు తను చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాకపోవడంతో ఉపాధి మార్గం ఏమిటా... అని రాత్రింబవళ్లు ఆలోచించాడట. చివరికి అతనికో ఆలచోన రావడంతో ఓ షాపును అద్దెకు తీసుకుని.. ఆ షాపుకు "కరీనా హాట్ పిజ్జాస్" అని పేరు పెట్టాడట. అంతే.. ఆ మరుసటి రోజునుంచి ఆ షాపు మహా పాపులర్ అయిందట. అంతేకాదు.. కరీనా హాట్ పిజ్జాస్ రుచిచూసేందుకు జనం కిక్కిరిపోతున్నారట.
కరీనా హాట్ హాట్ పిజ్జాలు కావాలని ఖుషీగా అడుగుతూ అంతే ఖుషీగా లొట్టలేసుకు తింటున్నారట. ఈ కరీనా హాట్ పిజ్జా విషయం కరీనాకు ఎవరో చెప్పబోతే... తన పేరు మీదున్న ఆ హాట్ పిజ్జాల గురించి తెలుసన్నదట. తెలిసి కూడా ఎందుకు ఊరుకున్నావని అడిగితే... "అతను నా అభిమాని. నా అభిమానులు నాకోసం ప్రాణాలివ్వడానికైనా సిద్ధంగా ఉంటారు. అటువంటివారు ఏదో వ్యాపారం కోసం కరీనా హాట్ పిజ్జాస్ అని పెట్టుకున్నంత మాత్రాన నాకొచ్చే నష్టం ఏమీ లేదు కదా. నా పేరును ఉపయోగించుకుని అతను జీవితంలో స్థిరపడటంపై నాకెంతో సంతోషంగా ఉంద"ని చెప్పిందట.