గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » నా మార్కెట్ వేల్యూ పెరిగిదంటున్న ప్రియమణి (Actress Priyamani | Hot Actress | Remunaration | Tollywood)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
WD
"ద్రోణ" చిత్రంలో పొట్టి బికినీలో కనిపించి టాలీవుడ్ టీనేజ్ కుర్రకారు గుండెల్లో గుబులు రేపిన ప్రియమణికి అవకాశాలు కాస్తంత తగ్గాయంటున్నారు. అయితే అదేమీ పైకి కనపడనీయడం లేదట ఈ పూబోణి. ఆఫర్లు తగ్గడానికి పారితోషికం పెంచడమే కారణమా...? అని ఓ పిల్ల జర్నలిస్టు అడిగితే, చివాల్న చూసి... " గతంలో నీ జీతం ఎంత... అదే జీతంతో ఏటెల్లకాలం కొనసాగుదామని అనుకుంటావా...? కాస్తా కూస్తో పెరగాలని అనుకోవూ..?

కష్టించి పనిచేస్తున్నప్పుడు దానికి తగ్గ ప్రతిఫలం ఆశించడంలో తప్పులేదు. ఇటీవల టాలీవుడ్‌లో 'ద్రోణ' వంటి సినిమాలతో నా మార్కెట్ రేంజ్ పెరిగింది. దానికి తగ్గట్లు పారితోషికం అడుగుతున్నా. అవకాశాలంటారా..? నాతో సినిమా చేయాలనుకున్నవారు నన్ను వదలరు. తప్పకుండా నా వద్దకే వస్తారు. కనుక దాని గురించి నేను ఫీలవను.." అంటోందట.

అదిసరే 'ద్రోణ' చిత్రంతో ఒక్కసారిగా మీ మార్కెట్ రేటు ఎందుకు పెరిగిందీ... అని అమాయకంగా పిల్ల జర్నలిస్టు మళ్లీ ప్రశ్నించాడట. దీంతో ప్రియమణికి చిర్రెత్తి... రయ్యమని కారు వద్దకెళ్లి దఢేల్ మని కారు డోర్ వేసుకుని తుర్రుమందట. ఇంతలో ఆ ప్రక్కనే ఉన్న ఓ సీనియర్ సినీ జర్నలిస్టు.. "ఏం కుర్రోడా... ద్రోణ చిత్రం ఒకసారి చూడు. అందులో ప్రియమణి ఈత కొలనులో తిరగడాన్ని చూడు... అప్పుడర్థమవుతుంది... ఆ రేంజ్ ఏమిటో..." అని అన్నాడట.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ప్రియమణి, హాట్ నటి, టాలీవుడ్, ద్రోణ