గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » ప్రభుదేవా ప్రమేయంతో నయనకు బాలీవుడ్ ఛాన్సు..!? (Prabhu Deva| Nayantara| Most Wanted| Pokiri| Hindi| Bollywood| Boney Kapoor)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
Nayana
FILE
సాధారణంగా ప్రియురాలికి ప్రేమికుడు ఏదో గొప్ప బహుమతినివ్వడం పరిపాటి. కానీ ఫిలిమ్ నగర్లో కొంతకాలం ప్రేమికులుగా అందరి నోట్లో నానుతోన్న ప్రభుదేవా-నయనతారల ప్రేమాయణంలో కొత్త సంగతి వెలుగులోకి వచ్చింది.

ఇందులో విషయమేమిటంటే..? కొరియోగ్రాఫర్, దర్శకుడు, నటుడైన ప్రభుదేవా.. తన ప్రియురాలు అయిన సెక్సీడాళ్ నయనతారకు బాలీవుడ్ ఛాన్సు ఇస్తున్నాడని తెలిసింది.

సల్మాన్ ఖాన్ హీరోగా హిందీలో విడుదలైన "వాంటెడ్" సూపర్ సక్సెస్ బాటలో పయనిస్తుండటంతో తిరిగి అదే టీమ్‌తో "మోస్ట్ వాంటెడ్" అనే సినిమాను నిర్మించేందుకు బోనీ కపూర్ సన్నాహాలు చేస్తున్నారు.

ఈ చిత్రంలో నయనతారకు అవకాశం ఇవ్వాలని ప్రభుదేవా నిర్మాత బోని కపూర్‌కు సిఫార్సు చేసినట్లు సమాచారం. బోనీ కపూర్ కూడా నయనకు అవకాశం ఇచ్చేందుకు సుముఖంగా ఉన్నట్లు భోగట్టా. అయితే ఇంకా ఆమెను హీరోయిన్‌గా ఖరారు చేయలేదని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

ఈ నేపథ్యంలో బాలీవుడ్‌లో నయనను రంగప్రవేశం చేయడంలో ప్రభుదేవా ఆసక్తిని చూస్తే వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగుతూనే ఉందని ఫిలిమ్ నగర్ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: ప్రభుదేవా, నయనతార, ప్రేమ, హిందీ పోకిరి, బాలీవుడ్, ఛాన్స్, మోస్ట్ వాంటెడ్, బోని కపూర్