గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » తమన్నా... నాతో నటిస్తావా...?: షారుక్ ఖాన్ (Tamannah | Sexy actress | Shahrukh Khan | Bollywood)
గుసగుసలు
Feedback Print Bookmark and Share
 
WD
గజినీ హీరోయిన్ అసిన్‌ను తన తదుపరి చిత్రంలో నటించాల్సిందిగా షారుక్ ఖాన్ అడిగితే ఆమె అందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. దీంతో షారుక్ అసిన్‌ పేరెత్తితే పళ్లు నూరుతున్నాడట. ఆమెకు పోటీగా తమిళంలో నటిస్తున్న ఓ అందాల తారను తన తదుపరి చిత్రంలో నటింపజేయడానికి అనేక రకాలుగా యత్నాలు చేస్తున్నాడట.

ఇందులో భాగంగా షారుక్ తన బ్లాగులో తన సరసన నటించేందుకు ఆసక్తిగల తమిళ హీరోయిన్లు సంప్రదించగలరు అని బహిరంగంగా ప్రకటన ఇచ్చేశాడట. ఇదిలావుంటే షారుక్ సరసన తెల్లపిల్ల తమన్నా అయితే సూపర్‌గా ఉంటుందని ఎవరో చెప్పారట. ఆ వార్త.. అలా.. అలా తమన్నా చెవికి చేరడంతో, ఆమె ప్రస్తుతం బాలీవుడ్ మేఘాలలో తేలిపోతోందట.

కోలీవుడ్ కోవాగా పేరుతెచ్చుకున్న తమన్నా, తన అందంతో శ్రేయ, అసిన్‌లను కోలీవుడ్ నుంచి తరిమికొట్టిందన్న వార్తలున్నాయి. ఈ నేపధ్యంలో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి తమ బూట్లలో కాళ్లు పెడుతుందేమోనని శ్రేయ, అసిన్, త్రిష ఆందోళన పడుతున్నట్లు భోగట్టా.
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: తమన్నా, సెక్సీ నటి, షారుక్ ఖాన్, బాలీవుడ్