1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
  4. Ravan

Priyamani | Ravan | Golimar | రాక్షసిలానే కాదు.. ఎలాగైనా నటిస్తా: ప్రియమణి

ప్రియమణి
"ఇండస్ట్రీలో నేను నటినే. నెంబర్ల గేమ్ లేదు. వన్... టూ... అని చెప్పుకోవడానికి ఇష్టపడను. నటిగానే సంతృప్తిగా ఫీలవుతాన"ని ప్రియమణి చెపుతోంది. 

తెలుగులో గోలీమార్‌లో నటించింది. హిందీలో రావణ్‌లో నటించింది.

రావణ్‌లో శూర్పణఖ పాత్ర చేస్తున్నారా అని అడిగితే... అది నన్ను అడగవద్దు. దర్శకులే చెప్పాలి.. అని తప్పించుకుంది.

ఏ భాషలో చేసినా ప్రియమణి ఎటువంటి పాత్రనైనా చేయగలదు అనిపించుకోవాలనేది తన ప్రయత్నం అంటోంది.

దర్శకులు కూడా అలానే నమ్ముతున్నారనీ, వారి నమ్మకాన్ని నిలబెడతాను అంది.
About Writer
వెంకటేశ్వర రావు యిమ్మడిశెట్టి, CPFC, NIFT