గుసగుసలు | ముఖాముఖి | సమీక్ష | రాబోయే చిత్రాలు | హాలివుడ్ | కథనాలు | అడ్రస్ డైరీ | ట్రైలర్స్ | నాటి వెండి కెరటాలు | ఆస్కార్ 2009
ప్రధాన పేజి వినోదం » వెండితెర » గుసగుసలు » నాది బాలీవుడ్ ఫిగర్ అండ్ గ్లామర్: పార్వతి మెల్టన్ (Actress Parvati Melton | Bollywood | Tollywood)
గుసగుసలు
Bookmark and Share Feedback Print
 
WD
టాలీవుడ్ పేరు చెబితే పార్వతీ మెల్టన్ కస్సుమంటోంది. "జల్సా"లో ప్రేక్షకులకు తన గ్లామర్‌ను జల్సా జల్సా చేసిన ఈ అందాలబొమ్మకు క్లోజ్ డైరెక్టర్ త్రివిక్రమ్ హ్యాండ్ ఇవ్వడంతో టోటల్‌గా టాలీవుడ్‌పై గొంతువరకూ కోపం పెట్టుకున్నట్లు భోగట్టా.

మహేష్ బాబు "ఖలేజా"లో ఛాన్సిస్తానంటూ తియ్యటి మాటలు చెప్పిన త్రివిక్రమ్ చివరి నిమిషంలో తనకు హ్యాండ్ ఇచ్చాడని మెల్టన్ తన సన్నిహితుల వద్ద వాపోతోందట.

ఈ కోపంతోనే టాలీవుడ్‌కు రమ్మన్నా రాననీ, నిజానికి తనది బాలీవుడ్ గ్లామర్ అనీ బడాయి పోతోందట. అంతటి అందాలు కలిగిన తాను టాలీవుడ్ సినిమాల్లో నటించాలని తీసుకున్న నిర్ణయం సరైంది కాదని ఇప్పుడనిపిస్తోందని ఫోజులు కొడుతోందట.

ఇంతకీ చేతిలో సిన్మాలున్నాయా...? అని అడిగితే... ఫుల్ బిజీ. కాకపోతే అన్నీ ఫైనల్ స్టేజ్‌లో ఉన్నాయని గొప్పలు పోతోందట. కానీ మెల్టన్‌కు ప్రస్తుతం చేతిలో సిన్మాలేవీ లేవనీ, దాంతో ఇంట్లో కూచుని గోళ్లు గిల్లుకుంటోందనీ బాలీవుడ్ సినీజనం చెపుతున్నారు. మరి ఈ మాట వింటే ఏమంటుందో..?!!
సంబంధిత సమాచారం కోసం శోధించండి.
దీన్ని కూడా శోధించు: పార్వతి మెల్టన్, బాలీవుడ్, టాలీవుడ్