నిత్యా మీనన్... అంటే అలామొదలైంది సినిమా గుర్తుకు వస్తుంది. ఈ భామ ఇటీవల సీసీఎల్ క్రికెట్ పోటీలకు గాను విమానంలో ప్రయాణం చేయాల్సి వచ్చిందట. ఆయా ఫిలిమ్ ఇండస్ట్రీల నుంచి హీరోహీరోయిన్లంతా విమానంలో ప్రయాణించేందుకు ఎక్కి కూచుకున్నారట. నిత్యా మీనన్ కూడా విమానం ఎక్కి తన సీట్లో కూచునేందుకు అలా వెళుతూ ఉన్నదట. మధ్యలో వెంకటేష్‌ను చూసి తన చూపును తిప్పుకోలేకపోయిందట. విమానంలో ఉన్న హీరోలందరికంటే వెంకటేష్ ఎంతో క్యూట్‌గా కనిపించాడట. ఇదే మాటను మంగళవారంనాడు బయటపెట్టేసింది. వెంకీని చూసి అంత అందంగా ఎలా ఉన్నాడోనని అనుకున్నానని చెప్పుకొచ్చింది. వెంకటేష్ పక్కనే హీరోయిన్ ఛాన్స్ కొట్టేయడానికేనా ఈ కోతలూ..? అంటే, అవును.. సినిమా నటీమణులు ఏది చెప్పినా ఇలా డొంక తిరుగుడుగానే ఆలోచిస్తారు. వెంకీని చూసినప్పుడు నాకు కలిగిన ఫీలింగ్‌ను చెప్పాననీ, ఆ తర్వాత ఎవరేం రాసుకున్నా ఫర్వాలేదని అంటోదట ఈ పొట్టి భామ.