అసలే తెలంగాణా తలనొప్పితో గులాంనబీ ఆజాద్ గిలగిలలాడుతుంటే ఆయనను కొత్తగా గే కమ్యూనిటీ పట్టుకుని ఉతికి ఆరేసే పనిలో పడింది. పురుషులతో పురుషులు, మహిళలతో మహిళలు పాల్గొనే సెక్స్.. గేయిజం దేశానికి దరిద్రంలా పట్టుకుందని ఇటీవల కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి గులాంనబీ ఆజాద్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై దేశంలో నిరసనలు పెల్లుబుకుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ సెలబ్రెటీలు గే కమ్యూనిటీకి వత్తాసు పలుకుతూ ఆజాద్ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటనలు చేశారు. వీరిలో బిపాసా ముందు వరుసలో ఉన్నది. హోమో సెక్సువాలిటీని చిన్నచూపు చూడటం తగదనీ, దీనికి కోర్టు సైతం చట్టబద్ధత కల్పించిన తర్వాత మంత్రిగారు అలా ఎందుకు మాట్లాడారో తనకైతే అర్థం కావడం లేదని వాపోయింది.