టాలీవుడ్ భామలు అవకాశాల కోసం విమానమెక్కుతున్నారు. దక్షిణాదిలో పోటీ ఎక్కువ కావడంతో ఉత్తరాదిపై దృష్టి సారించారు. ఇక్కడ అరకొరగా చూపించిన అందాలను అక్కడ ఆరబోసేందుకు సై అంటున్నారు. ప్రత్యేకించి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కట్టుబొట్టుతో అడపాదడపా లంగా ఓణీలతో అచ్చతేనె తెలుగమ్మాయిలుగా కనిపించిన.. ఈ ముద్దుగుమ్మలు బాలీవుడ్ హీరోల సరసన చేరే సరికి తమలోని సిగ్గును పూర్తిగా మరిచిపోయారు.