జయం చిత్రంతో తెలుగు వెండితెరకు పరిచయమైన హీరోయిన్ సదా. ఈ చిత్రంలో 'వెళ్ళవయ్యా వెళ్లూ..' అంటూ ప్రేక్షకుల మదినిదోచేసింది. ఆ తర్వాత హీరో విక్రమ్‌తో నటించిన అపరిచితుడు చిత్రం మినహా సదా నటించిన చిత్రాలేవీ విజయాన్ని దక్కించుకోలేక పోయాయి. దీంతో హీరోయిన్ వేషాలు రాకపోవడంతో ఐటమ్ సాంగ్‌లలో నటించేందుకు సై అంది.