ప్రస్తుతం అల్లు అర్జున్ ఆస్ట్రేలియాలో ఆపరేషన్ చేయించుకుంటున్నారు. యాక్షన్ సన్నివేశాల్లో భుజాల నొప్పితో బద్రినాథ్‌లో చాలా బాధపడ్డారు. అంతకుముందు చిత్రంలో జరిగిన గాయాలు.... మానినట్లు మాని క్రమేణా మరింతగా పెరిగాయి. దాంతో రియల్ఫైట్స్కు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచించారు. అయినా లెక్కచేయకుండా బద్రినాథ్‌లో ఫైట్స్చేశారు. ఇదిలా ఉండగా, బద్రినాథ్ లాంటి చిత్రం తర్వాత అల్లు అర్జున్ నటించే చిత్రం ఏమయివుంటుందనే అభిమానుల నుంచి సామాన్యుడికి ఓ టాపిక్‌గా మారింది. జల్సా చిత్రంతో మాటలను ఖుషీ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. దానయ్య, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన ఇలియానా నటిస్తోంది.