డర్టీ పిక్చర్స్ చిత్రంలో తనలో దాగివున్న మరోకోణం నటన వెలికి వస్తుందని బాలీవుడ్ నటి విద్యాబాలన్ అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, ఈ చిత్రం విడుదల తర్వాత తనపై సెక్సీ హీరోయిన్ అనే ముద్రను వేస్తారంటూ వస్తున్న వాదనలను ఆమె తోసిపుచ్చారు. దీనిపై విద్యాబాలన్ మాట్లాడుతూ.. తనపై పోర్న్ స్టార్ ముద్ర వేసినప్పటికీ భయపడే ప్రసక్తే లేదన్నారు. సిల్క్‌స్మిత పాత్రలో నటించే నటిగా మాత్రమే నన్ను నేను భావిస్తున్నాను. దీనికి ఒక ముద్ర వేస్తారని తాను అనుకోవడం లేదన్నారు. నాలోని నటనకు ఇది మరొక కోణమన్నారు. కాగా, ఏక్తాకపూర్ నిర్మాతగా మిలన్ లూథిరా రూపొందిస్తున్న ఈ చిత్రంలో నరిసుద్దీన్ షా, ఎమ్రాన్ హష్మి, తుషార్ కపూర్లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.