కొరియోగ్రాఫర్, దర్శకుడు, నయనతారకు కాబోయే భర్త ప్రభుదేవా రొమాంటిక్ సినిమాలపై కన్నేశాడు. తమిళంలో రూపొందుతున్న వెడి చిత్రంలో పందెంకోడి ఫేమ్ విశాల్, సమీరారెడ్డిలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో కొన్ని హాట్ హాట్ సన్నివేశాలను ప్రభుదేవా షూట్ చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో హీరోహీరోయిన్ల మధ్య బాత్రూమ్లో కిస్సింగ్ సీన్ ప్రేక్షకులను, కుర్రకారును పెద్ద ఎత్తున ఆకట్టుకుంటుందని ఫిలిమ్ నగర్ వర్గాల్లో టాక్. తెలుగులో హిట్ అయిన శౌర్యం సినిమాను తమిళంలో వెడిగా రీమేక్ చేస్తున్న ప్రభుదేవా హీరోహీరోయిన్ల మధ్య హాట్ హాట్ సీన్స్‌ను ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా విశాల్, సమీరాల మధ్య హాట్ సీన్స్‌తో పాటు సోఫీ చౌదరి-విశాల్‌ల మధ్య ఐటమ్ సాంగ్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందట.