టాలీవుడ్లో ఝుమ్మంది నాదం చిత్రంలో తెరంగేట్రం చేసిన తెల్లపిల్ల తాప్సీ తాజాగా కోలీవుడ్ కొత్త హీరో మహత్తో మిడ్నైట్ పార్టీల్లో ఎంజాయ్ చేస్తోందట. ఇటీవల వీరిద్దర్నీ కోలీవుడ్ ఫిలిమ్ జనం అనేకసార్లు చూశారట కూడా. అదేమని అడిగితే డిస్కషన్స్ చేసుకునేందుకు వస్తున్నాం అని చెపుతున్నారట. తెలుగులో ఝుమ్మంది నాదం తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంలో నటించి మంచి మార్కులు కొట్టేసిన తాప్సీ అటు తర్వాత తన దృష్టిని కోలీవుడ్ వైపు మరల్చింది. అక్కడ ధనుష్‌తో ఓ చిత్రంలో నటించి సెక్సీ హీరోయిన్ అనిపించుకుంది. ఈమె నటించిన వచ్చాడు - గెలిచాడు చిత్రం తెలుగు తమిళ భాషల్లో విడుదలైంది. ఈ చిత్రంలో తాప్సీని చూసిన జనం, ఆమె గ్లామర్ అలా వాడిపోయిందేమిటి..? అని చర్చించుకుంటున్నారు. ఐతే గ్లామర్ తగ్గిపోవడానికి కారణం ఆ మిడ్ నైట్ పార్టీలే అని చెపుతున్నారు కోలీవుడ్ ఫిలిమ్ జనం. తాప్సీ మాత్రం తనకు ఇంకా ప్రేమించే వయసు రాలేదని బుకాయిస్తోంది. కానీ మిడ్ నైట్ పార్టీలకు వెళ్లే వయసు రాలేదని చెప్పలేదు కదా..!!