సన్నీ లియోన్... కొత్తగా పరిచయం చేయనక్కరలేదు. 'బిగ్ బాస్-5' తర్వాత భారతీయ సినీ మార్కెట్‌ను క్యాచ్ అండ్ క్యాష్ చేసుకుంది. ఈ ఇండో-కెనడియన్ పోర్న్ గర్ల్ త్వరలోనే టాలీవుడ్ చిత్ర రంగ ప్రవేశం చేయనుంది. ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు మహేష్ భట్ నిర్మిస్తున్న 'జిస్మ్-2' చిత్రం షూటింగ్ శరవేగంగా రాజస్థాన్‌లో జరుగుతోంది. కొద్దిగా పోస్ట్, ప్రీ ప్రొడక్షన్‌లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. అయితే, టాలీవుడ్ తాజా సమాచారం మేరకు.... 'జిస్మ్-2' చిత్రాన్ని తెలుగులోకి అనువదించనున్నారు. గతంలో అనేక బాలీవుడ్ చిత్రాలు తెలుగులోకి అనువదించగా, పలు చిత్రాలు బాక్సాఫీస్ విజయాన్ని నమోదు చేసుకున్నాయి.